పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణకు తీరని లోటు: జైపాల్ రెడ్డి

కలం, కరీంనగర్: ప్రముఖ తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణం పట్ల ఓసీ జేఏసీ (OC JAC) రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం సమాఖ్య కార్యాలయంలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, రావుల నర్సింహారెడ్డి, కామిడి సతీష్ రెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, నల్లా రాజి రెడ్డి తదితరులతో కలిసి గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావులు నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. సౌమ్యుడిగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఈనెల 26వ తేదీన చాతి నొప్పికి గురై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం అర్థ రాత్రి దాటిన తర్వాత మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్ర సమాజానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ఆయన శాసన సభ్యుడిగా ప్రాతినిద్యం వహించిన నర్సంపేట పేట నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు.

విద్యార్థి నాయకుడిగా, నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి జెడ్పీటీసీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా కాలం పని చేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ గా సేవలు అందించి ఓసీలలోని పేదల న్యాయమైన సమస్యల పరిష్కారానికి, రైతాంగ అభ్యున్నతికి, విద్యార్థుల, యువత సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి విశేష కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరనీయం అని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల, ఓసీ జేఏసీ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్తిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావు ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>