కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad ) అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( NUDA(నుడా)) చైర్మన్ కేశ వేణు, నగర మేయర్ ఉమా రాణి తో కలిసి బుధవారం నగరంలోని ప్రధాన జంక్షన్లను పరిశీలించారు. ఇరుకుగా ఉన్న రోడ్లను విస్తరించడం, అలాగే ఎల్లమ్మగుట్ట నుండి బాల హనుమాన్ వరకు వెళ్లే వంతెన, రాజీవ్ గాంధీ సర్కిల్–100 ఫీట్ రోడ్డులో గల వంతెన, కోటగల్లి నుండి 100 ఫీట్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించాల్సిన వంతెనలు, నగరంలో ఇరుకుగా ఉన్న ఇతర వంతెనల విస్తరణకు సంబంధించిన అంశాలను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, MIM అధ్యక్షుడు , కార్పొరేటర్ షకీల్, ఎల్లమ్మగుట్ట కార్పొరేటర్ పంచరెడ్డి చరణ్, R&B DE ప్రవీణ్, మున్సిపల్ EE తిరుపతి కుమార్, పబ్లిక్ హెల్త్ AE శంకర్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు ‘నుడా’ చైర్మన్ చైర్మన్ కేశ వేణు పలు సూచనలు చేశారు. నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేశ వేణు సూచించారు.

