కేసీఆర్ సంచలన డెసిషన్.. లక్ష మందితో!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుల కోసం అవసరమైతే పాదయాత్ర చేపడుతానని స్పష్టం చేశారు. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు పాదయాత్రగా వెళ్దామని పార్టీ నేతలతో అన్నారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో జరిగిన బీఆర్ఎస్పీ సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ జరుగుతోంది. నా చావు కోరుకుంటూ రోజూ ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడు. అలాంటి బూతుల వీరుడు నన్ను అసెంబ్లీకి రావాలంటున్నాడు. మీరే చెప్పండి అసెంబ్లీకి రావాలా..? వద్దా..? బూతులు మాట్లాడేవారితో నేను అసెంబ్లీలో చర్చించాలా..?’ అని ప్రశ్నించారు.

Also Read : బీఆర్ఎస్ఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక ఆదేశాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>