ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : కొందరు ట్రాన్స్‌జెండర్లు శుభకార్యాలు, వ్యాపారా వేదికల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) సీరియస్ అయ్యారు. ఇలాంటి బెదిరింపులు, దోపిడీలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని కమిషనరేట్ల సీపీలను ఆదేశించారు. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెగ్గింగ్ రాకెట్లు, బలవంతపు వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నియంత్రించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఇటీవల హైదరాబాద్‌లోని చింతల్ లో ఓ గృహప్రవేశ వేడుకలో ట్రాన్స్ జెండర్లు దారుణంగా వ్యవహరించిన వీడియో వైరల్ గా మారడంతో డీజీపీ తాజా చర్యలు తీసుకున్నారు. సదరు కుటుంబం గృహంలోకి ప్రవేశించేందుకు రాగా, కొందరు ట్రాన్స్‌జెండర్లు వారిని అడ్డుకొని ఇంట్లోకి వెళ్లాలంటే రూ. 50,000 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అంత భారీ మొత్తం ఇచ్చుకోలేమని బాధితులు చెప్పినా వినకుండా అసభ్యంగా ప్రవరిస్తూ, శాపనార్థాలు పెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బాధితుల వీడియో వైరల్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. శుభకార్యాలు, వ్యాపార వేదికల వద్ద భయభ్రాంతులకు గురిచేసే ముఠాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>