కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ (NEET) పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలపై కేంద్రం బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని ఎన్ఎస్‌యూఐ (NSUI) నిరసన వ్యక్తం చేసింది. ముఖ్యమైన పరీక్షల్లో అవకతవకలు జరగడం విద్యా వ్యవస్థకు సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, ఎన్ఎస్‌యుఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం విద్యా వ్యవస్థ లోపాలకు నిదర్శనమన్నారు. ఇటీవల యువత ఢిల్లీలో ధర్నాలు, నిరసనలు చేసినా కేంద్రం ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు.
చైనాలో పరీక్ష పేపర్లు లీక్ (Paper Leak) చేసినవారికి ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారని గుర్తుచేశారు. వరుసగా పేపర్ లీక్ ఘటనలు జరుగుతున్నప్పటికీ, రీఎగ్జామ్ నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడమేనని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, గుర్రం వాసు గౌడ్, రెహమాన్, రమేశ్ పాల్గొన్నారు.
Read Also: పవన్ కళ్యాణ్ ఇష్యూపై రేవంత్ అనూహ్య వ్యాఖ్యలు
Follow Us On: Instagram

