పవన్ కళ్యాణ్ ఇష్యూపై రేవంత్ అనూహ్య వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో రేవంత్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై మాట్లాడారు. ముఖ్యంగా పవన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఇటీవల పవన్ కొన్ని అంశాలపై తెలంగాణ నేతలను ప్రశ్నించగా, దానికి పొన్నం సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) తనకు ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ ఇబ్బందులు లేవని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తెలంగాణలో ఎవరైనా రాజకీయం చేయొచ్చని, పోటీ చేయొచ్చని చెప్పారు. పవన్‌కు నచ్చినట్టు ఉండే హక్కు ఉందన్నారు. అయితే భద్రత కారణాల వల్ల పవన్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>