కలం, వెబ్ డెస్క్ : బాలాపూర్‌లోని (Balapur) నబీల్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకుంటూ కొద్దిసేపట్లోనే అదుపులోకి తీసుకొచ్చారు. గోదాంలో ఉన్న నిల్వ సామగ్రి కారణంగా మంటలు ఉద్ధృతంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

