వరంగల్ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కు పిండ ప్రదానం చేసిన నోముల భగత్

కలం, నాగార్జునసాగర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆరోపిస్తూ నాగార్జునసాగర్ కృష్ణానది తీరంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ కు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (Nomula Bhagath) పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. ఓట్ల కోసమే కాంగ్రెస్‌ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్‌ ప్రకటించి అమలు చేయలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత కేసీఆర్ రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పోరాడిందన్నారు. రైతులకు న్యాయం చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ఉద్యమ నేత కేసీఆర్ రైతు బాంధవుడు అని అన్నారు. రైతులను రాజును చేసేందుకు రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, చివరి ఆయకట్టు భూములకు సాగునీరు, పలు పంటలకు బోనస్ అందించిన విషయాన్ని ఈ సంద‌ర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రమేష్ జి, పొదిల శ్రీను, నాగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>