కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని దుబ్బలో వినాయక నిమజ్జన రథయాత్రను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమజ్జన రథయాత్రకు శ్రీకారం చుట్టారు. వినాయక నిమజ్జన రథయాత్రలో భక్తులు, స్థానికులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, భక్తి శ్రద్ధలతో రథయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా నగరంలో భక్తి వాతావరణం నెలకొంది. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు, స్థానికులు ఏర్పాట్లు చేశారు. కాగా, నిజామాబాద్ లో నిమజ్జనం రోజు ప్రత్యేకంగా సార్వజనిక్ మండలి రథయాత్ర ఉంటుంది.

