కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (Nizamabad Prajavani) కార్యక్రమానికి 148 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ సాయన్న, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

