కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో శుక్రవారం జరుగనున్న గణపతి నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా, గణపతి రథం వెళ్ళే మార్గాన్ని నగర మేయర్ కూరగాయల ఉమారాణి (Mayor Kuragayala Umarani) పరిశీలించారు. దుబ్బా చౌరస్తా నుండి వినాయక్ నగర్‌లోని వినాయకుడి భావి వరకు ఉన్న మార్గాన్ని సమగ్రంగా పరిశీలించారు. రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు శోభాయాత్ర సజావుగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నిమజ్జన శోభాయాత్ర భక్తులకు సురక్షితంగా, సజావుగా భక్తి భావంతో జరగాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థ గణపతి నిమజ్జన ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కార్పొరేటర్లు మనోహర్, నయీం, అమర్, సజ్జత్, కో-ఆప్షన్ సభ్యులు నరేందర్ సింగ్, అశోక్, అవిన్ పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు.

