కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రధాని మోడీ పిలుపుమేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత, జాతీయ నాయకులు యెండెల లక్ష్మీనారాయణ (Endela Lakshminarayana) తన సతీమణి వనజతో కలిసి నిజామాబాద్ (Nizamabad) లోని తన ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులలో దేశభక్తిని, ఐక్యత శక్తిని పెంపొందించడం కోసం ప్రధాని మోడీ స్వాతంత్ర దినోత్సవం రానున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ పిలుపును అనుసరించి ప్రతి భారతీయుడు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేయాలని, దేశ విద్రోహశక్తులకు మన దేశభక్తితోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

