నీట్‌పై తమిళనాడు అసెంబ్లీ కీలక తీర్మానం

కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందేనని తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) తీర్మానం చేసింది. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేసింది. ఆలిండియా స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కారణంగా.. వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న గ్రామీణ, నిరుపేద విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోతున్నారని పేర్కొంది. డాక్టర్లు కావాలన్న వారి కలకు నీట్ పరీక్ష పెద్ద ప్రతిబంధకంగా మారిందని వివరించింది. అంతేగాకుండా, ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ ఫీజులు భారీగా ఉంటున్నాయని, పేద విద్యార్థులు వాటిని భరించలేరని స్పష్టం చేసింది.

నీట్ పరీక్షలో అవకతవకలు..

నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకుండా పోయిందని, అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల జరిగిన ఘటనలను అసెంబ్లీ ఉదహరించింది. నీట్ కారణంగా తమిళనాడు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే రద్దు చేయాలని కేంద్రానికి తీర్మానం పంపించింది. నీట్ రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాగే కేంద్రానికి పంపించగా, తమిళనాడులో కొలువు దీరిన విజయ్ సర్కార్ కూడా రద్దు చేయాలని కోరుతోంది.

FCRA బిల్లుపై కూడా..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో మరో తీర్మానం చేసింది. ఎన్జీవోల ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకుని, వాటిపై కేంద్రం నియంత్రణ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని, వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>