గోదావరికి జలకళ.. కాళేశ్వరం పంపులు స్టార్ట్!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి వద్ద గోదావరి నది భారీగా ప్రవహిస్తోంది. ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌ల మోటార్లు (Kaleshwaram Pumps) పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలు (Kaleshwaram Water Lift) వేగవంతమయ్యాయి. గత కొన్ని రోజులుగా పంపులు సరిగ్గా నడపకపోవడంతో ఎండిపోతున్న పంటలను కాపాడాలని, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి జలాశయాలను నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

విపక్షాల విమర్శలు, రైతు ప్రయోజనాల నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి పంపింగ్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లోని రెండు భారీ పంపుల ద్వారా దాదాపు 6,400 క్యూసెక్కుల నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అదేవిధంగా, రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లోని రెండు పంపులను ప్రారంభించి 6,600 క్యూసెక్కుల గోదావరి జలాలను రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి మళ్లిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లోని రిజర్వాయర్లు వేగంగా జలకళను సంతరించుకుంటుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>