Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ డాన్స్ మాస్టర్‌‌కు “నాట్య రత్న” అవార్డు

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలుగు కళాకార్ టీవీ “నాట్యం” కార్యక్రమంలో నిజామాబాద్ (Nizamabad) డాన్స్ మాస్టర్ వినయ్‌ (Vinay) కు “నాట్య రత్న” అవార్డు – వీసీ స్టెప్స్ అకాడమీ చిన్నారులకు “బెస్ట్ ఫోక్ డాన్స్ పెర్ఫార్మెన్స్” అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, కోటి వేదికగా తెలుగు కళాకార్ టీవీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన “నాట్యం” సాంస్కృతిక కార్యక్రమం కళాకారుల ప్రతిభకు అద్దం పట్టింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ వినయ్ కుమార్ నృత్య రంగానికి, యువతకు చిన్నారులకు చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి నిర్వాహకులు నాట్య రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు.

ఈ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని వినయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ స్టెప్ డాన్స్ ఫిట్‌నెస్ అకాడమీకి చెందిన చిన్నారులు ప్రదర్శించిన జానపద ఫోక్ డాన్స్ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల సమన్వయం, హావభావాలు, వేషధారణ, వేదికపై వారి ప్రదర్శనకు న్యాయనిర్ణేతలు అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అకాడమీ చిన్నారులను బెస్ట్ ఫోక్ డాన్స్ పెర్ఫామెన్స్‌తో సత్కరించారు.

ఈ అవార్డును తేలి కామాఖ్య, ఆలియా తబస్సుం, శరణ్య నక్షత్ర, గైని లాస్య, అమ్గోత్ లహరి అందుకున్నారు. కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి గొప్ప వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ ఎస్.కె.సిరాజ్ కి డాన్స్ మాస్టర్ వినయ్ కృతజ్ఞతలు తెలిపారు. కళ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు కొత్త తరానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కళాకారులు, నృత్య గురువులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు, తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొని విజేతలను అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>