Mobile Popup Ad
Mobile Popup Ad

యువతకు గుడ్‌న్యూస్.. సిద్దిపేటలో నాలుగు రోజుల పాటు ఏఐ వర్క్‌షాప్!

కలం, మెదక్ బ్యూరో: అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు, యువకులు వారి నిత్య జీవితాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. నిరుద్యోగులు భవిష్యత్ లో ఉద్యోగ అవకాశాలు పొందడమే లక్ష్యంగా సిద్దిపేట (Siddipet) బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

దీనికి సంబంధించి ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పరిజ్ఞానం, సాంకేతిక పరిచయం, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం వంటి ఉపయోగాలు కలుగుతాయని సూచించారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం ఇలా ఎన్నో బలమైన అడుగులు వేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట (Siddipet) యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు.

Read Also: రూ.500 పెన్ష‌న్ కోసం అత్త‌ను భుజాల‌పై మోస్తూ 5 కి.మీ ప్ర‌యాణం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>