Mobile Popup Ad
Mobile Popup Ad

బ‌డ్జెట్ కాపీని రాష్ట్ర‌ప‌తికి అందించిన నిర్మ‌లా సీతారామ‌న్‌

క‌లం, వెబ్‌ డెస్క్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము(Droupadi Murmu)ను క‌లిశారు. నేడు లోక్ స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్(Union Budget) ప్ర‌వేశ పెట్ట‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తికి బ‌డ్జెట్ కాపీని రాష్ట్ర‌ప‌తికి అంద‌జేశారు. 2026-27 బ‌డ్జెట్ రూ.58 ల‌క్ష‌ల కోట్లు ఉండే అవకాశం ఉంది. గ‌తేడాది కంటే 8 నుంచి 12 శాతం నిధులు పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ర‌క్ష‌ణ‌, మౌలిక వ‌స‌తులు, రైల్వే, వ్య‌వ‌సాయంతో పాటు ఆరోగ్యం, విద్య, పారిశ్రామిక రంగాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. రాష్ట్రాల కంటే రంగాల వారీగా నిధులు కేటాయింపులు ఎక్కువ‌గా జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రి కొద్దిసేప‌ట్లో నిర్మ‌లా సీతారామ‌న్ లోక్ స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>