epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

పార్లమెంట్ లో బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​

కలం, వెడ్​ డెస్క్​ : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27)​ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్ సభలో ప్రవేశపెట్టారు.  అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న వేళ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు బడ్జెట్​ రూపకల్పన చేశారు. వరుసగా 9వ సారి బడ్జెట్​ ప్రవేశపెట్టి  నిర్మలా సీతారామన్​ చరిత్ర సృష్టించారు. ఆదివారం అయినా ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆనవాయితీని కేంద్రం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆదివారం బడ్జెట్​ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్​ సభలో విత్త మంత్రి నిర్మలమ్మ బడ్జెట్​ ప్రసంగం ప్రారంభించారు. మొత్తం బడ్జెట్​ వ్యయం రూ. 54. లక్షల కోట్లుగా ఉంది. ఇందులో మూలధన వ్యయంలో రూ. 12.2 లక్షల కోట్లు మౌళిక సదుపాయాలకు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 9శాతం ఎక్కువ.

Read Also: కేంద్ర బడ్జెట్ : ఆసక్తికర విశేషాలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>