Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మలమ్మ బడ్జెట్ శారీస్ స్పెషల్

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)  వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఆమె ఆ రోజున ధరించే చీరపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. భారత చేనేత వస్త్ర కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఆమె చీరలను ఎంచుకుంటారని, ఆ చీరల వెనక ఒక నిశ్శబ్ద సందేశం దాగి ఉంటుందనేది పలువురు పార్లమెంటు సభ్యుల అభిప్రాయం. ఇప్పటివరకు ఆమె ప్రవేశపెట్టిన తొమ్మిది బడ్జెట్‌ల సందర్భంగా ఆమె ధరించిన చీరలపై రకరకాల కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఈసారి కాంచీపురం పట్టు చీరను ధరించి రావడం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లను సెంటిమెంట్‌తో ఆకర్షించే వ్యూహం ఉందన్న వాదన కూడా వినిపించింది. తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా మెరూన్ రంగు చీరను ఎంపిక చేసుకోవడం వెనక ఉద్దేశం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనన్న మాటలూ వచ్చాయి.

ఇప్పటివరకు ఆమె ధరించిన చీరల గురించి సంక్షిప్తంగా :

2026 : కాంచీపురం పట్టు (తమిళనాడు)
2025 : మధుబని హ్యాండ్ పెయింటెడ్ (బీహార్)
2024 : మంగళగిరి సిల్స్ (ఆంధ్రప్రదేశ్)
2024 : బ్లూ టస్సర్ సిల్క్ (కాంతా, పశ్చిమబెంగాల్) ఇంటెరిమ్ బడ్జెట్ సందర్భంగా
2023 : ఎరుపురంగు పట్టు (కసూతి వర్క్, కర్ణాటక)
2022 : చాక్లెట్ బ్రౌన్ బొంకై (ఒడిశా)
2021 : పోచంపల్లి ఇక్కత్ (తెలంగాణ)
2020 : పసుపు రంగు పట్టు (అభివృద్ధికి చిహ్నం, మంగళసూచకం)
2019 : మంగళగిరి పింక్ కలర్ పట్టు (ఆంద్రప్రదేశ్)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>