భారతీయులు సేఫ్.. నేపాల్ వరదలపై కేంద్రం ప్రకటన

కలం, వెబ్ డెస్క్: నేపాల్ వరదల (Nepal Floods) కారణంగా గల్లంతైన భారతీయుల గుర్తింపు ఇంకా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న కాఠ్‌మాండూ చేరుకున్న 21 మంది సేఫ్‌గా ఢిల్లీకి చేరుకున్నారని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు వెల్లడించారు. “21 మంది తమిళనాడుకు చెందినవారు. త్రిశూలి వన్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న మరో 63 మంది భారతీయులు కూడా క్షేమంగా ఉన్నారు. చైనా వైపున 400 మంది భారతీయులు కూడా ఉన్నారు. వారంతా క్షేమంగానే.. ఎంబసీ అధికారులు, కుటుంబ సభ్యులకు నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఇంకా 320 మంది ఆచూకీ తెలియడం లేదు. అందులో 100 మంది భారతీయులు ఉండి ఉండొచ్చు. వీరంతా కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లి ఉంటారని భావిస్తున్నాం” అన్నారు.

సహాయక చర్యలు ముమ్మరం..

నేపాల్‌కు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నామని రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఇప్పటివరకు 60 టన్నుల సామగ్రిని ట్రాన్స్‌పోర్ట్ విమానాల ద్వారా పంపించినట్లు వివరించారు. షెల్టర్లు, బ్లాంకెట్లు, హై జీన్ కిట్స్, సోలార్ ల్యాంపులు, ఔషధాలున్నాయని తెలిపారు. తమకు తగినంత సాయం అందించాలని నేపాల్ నుంచి విన్నపాలు వచ్చాయని.. కేంద్రం వేగంగా స్పందిస్తోందన్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడే చర్యలు నిరంతరం కొనసాగుతుంటాయని, చివరి వ్యక్తిని కూడా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయక సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>