ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన

కలం, నిర్మల్ : ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైటీసీ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అభినందించారు. కళాశాల విభాగంలో నిర్మల్ ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ద్వితీయ సంవత్సరానికి చెందిన 8 మంది విద్యార్థినులు, నృత్య పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు.

అలాగే పాఠశాల విభాగంలో ఖానాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు ప్రోత్సాహక బహుమతి సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను విద్యార్థులకు, శిక్షకులకు జిల్లా కలెక్టర్ శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు. అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, జిల్లాకు పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులకు త్వరలోనే నగదు బహుమతి అందజేస్తామని తెలిపి వారిని ప్రోత్సహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>