Mobile Popup Ad
Mobile Popup Ad

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే : ఎస్పీ

కలం, నిర్మల్​ : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే గ్రీవెన్స్ డే (Grievance Day) కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకురాగా, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ (Nirmal SP) మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కల్పించేందుకు గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలైనా నేరుగా పోలీసు శాఖ దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సత్వర న్యాయం అందించే దిశగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Read Also: లబ్ధిదారులకు అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’కు కొత్త రూల్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>