ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, చట్టపరంగా పరిశీలించి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తూ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>