కలం, నిర్మల్: భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ (Nirmal) రూరల్ ఎస్సై లింబాద్రి (SI Limbadri) అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్మల్ మండలంలోని ముక్తాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్ రమేష్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Also: ఒక్కటి కూడా మిస్ కావొద్దు.. కేటీఆర్ సూచన
Follow Us On: X(Twitter)

