కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో పాటే మా ప్రాణం సంగీత అకాడమీ (Nirmal Music Lovers) ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ గాయని ఎస్. జానకి(S Janaki)కి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె భారతీయ సినీ సంగీతానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, “గాయని మరణించవచ్చు.. కానీ ఆమె గానం ఎప్పటికీ మరణించదు” అని వక్తలు పేర్కొన్నారు. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించి ‘దక్షిణ భారత కోకిల’గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చెనిగారపు నాగరాజుతో పాటు డాక్టర్ కృష్ణంరాజు, నేరెళ్ల హనుమంతు, వేణు వర్మ, శ్రీనివాస్, జాను అనిల్, కడారి దశరథ్, శ్రీకాంత్, బన్నీ, నవ్య, సుజాత, సంగీతాభిమానులు పాల్గొన్నారు.

