పాలజ్ కర్ర గణపతి వద్ద నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నదానం

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బోకర్ మండలం పాలజ్ గ్రామంలోని ప్రసిద్ధ కర్ర గణపతి ఆలయం వద్ద నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి (Appala Kavya Ganesh Chakravarthy) శుక్రవారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ర గణపతికి (Karra Ganapati) ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదాన కార్యక్రమానికి ముందు సార్వజనిక్ పాలజ్ కర్ర గణేష్ మండలి సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు నిర్వహించి గణనాథుడికి నైవేద్యం సమర్పించారు.

భక్తులకు అన్నప్రసాదం పంపిణీ

పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి అన్నప్రసాదం పంపిణీ చేశారు. పాలజ్ కర్ర గణపతిని దర్శించుకునేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ మండలి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>