ఎమ్మెల్యే ఏలేటి జన్మదిన వేడుకలు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు..

కలం, నిర్మల్: బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) జన్మదినం సందర్భంగా మంగళవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో జన్మదిన వేడుకల సందడి నెలకొంది. బీజేపీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, తహసీల్దార్లు, టీఎన్జీవో సంఘ నాయకులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.

Also Read : చేతకానితనాన్ని ఎల్‌నినో మీద పెడుతున్న రేవంత్.. హరీశ్ రావు ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>