ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కీలక హామీ

కలం, సోన్ :  అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేయిస్తానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti) అన్నారు. బుధవారం సోన్ మండల (Soan Mandal) కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో మండలానికి చెందిన 119 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు కాక పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకునేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలవుతోందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ సంతోష్, ఎంపీఓ జ్యోతి, సర్పంచులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>