లాస్ ఏంజెల్స్‌పై గురి.. ముందే కోటాలు!

కలం, స్పోర్ట్స్: ఆసియా క్రీడల్లో అదరగొట్టిన భారత మహిళా బాక్సర్ల టార్గెట్ ఇప్పుడు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్. 2027లోనే వీలైనన్ని ఒలింపిక్ కోటాలు కొట్టేయాలని జాతీయ మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ శాంటియాగో నీవా ప్లాన్ చేస్తున్నాడు. తొలి అవకాశం వచ్చే ఏడాదే ఉంది. కజకిస్థాన్ వేదికగా జరిగే 2027 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఎక్కువ కోటాలు సాధించడమే నీవా టార్గెట్. ఆ తర్వాత ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌తో పాటు 2028లో మరో రెండు అవకాశాలు ఉంటాయి. అయితే చివరి వరకు క్వాలిఫికేషన్ కోసం ఎదురుచూడటం నీవాకు ఇష్టం లేదు. ముందుగానే కోటాలు వస్తే ఒలింపిక్స్ కోసం ఎక్కువ సమయం దొరుకుతుందని భావిస్తున్నాడు.

అప్పుడు బాక్సర్లు పూర్తిగా ఒలింపిక్ ప్రిపరేషన్‌పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. 2026లో భారత మహిళా బాక్సింగ్ ఇప్పటికే సత్తా చాటింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి. ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో మూడు పతకాలు దక్కాయి. అందులో రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ విజయాల వెనుక పటిష్టమైన ప్రిపరేషన్ ఉందని నీవా తెలిపాడు. అంతర్జాతీయ అనుభవం, దేశీయ క్యాంపులు, నాణ్యమైన స్పారింగ్‌తో బాక్సర్లను సిద్ధం చేసినట్లు చెప్పాడు. పటియాలలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనూ శిక్షణకు మంచి సపోర్ట్ ఉందని వివరించాడు.

సుమారు 20 మంది కోచ్‌లు, మరో 20 మంది సపోర్ట్ స్టాఫ్‌తో బృందం పనిచేస్తోందని తెలిపాడు. ఆసియా క్రీడలకు ముందు పటియాలో డొమినికన్ రిపబ్లిక్, ఇరాన్ బాక్సర్లతో స్పారింగ్ జరిగింది. ఆ తర్వాత జపాన్‌లో తుది దశ ప్రిపరేషన్ సాగింది. ఆసియా క్రీడల విజయంతో సంతృప్తి చెందే పరిస్థితి లేదని నీవా స్పష్టం చేశాడు. ఇక అసలు టార్గెట్ 2027 వరల్డ్స్. అక్కడే కోటాల వేట మొదలు పెట్టి.. లాస్ ఏంజెల్స్‌కు ముందుగానే బర్తులు ఖరారు చేసుకోవాలన్నది భారత మహిళా బాక్సింగ్ జట్టు ప్లాన్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>