కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న శుక్రవారం తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలందించిన 71 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

