ఈలా దూకుడు.. యూఎస్ ఓపెన్‌లో మరో విజయం!

కలం, స్పోర్ట్స్: ఫిలిప్పీన్స్ టెన్నిస్ స్టార్ అలెక్స్ ఈలా (Alex Eala) యూఎస్ ఓపెన్‌లో దూసుకెళ్తోంది. టోర్నీలో తొలిసారి మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండ్రా ఒలినికోవాపై 6-1, 6-4తో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఈలా దూకుడుగా ఆడింది. తొలి ఎనిమిది పాయింట్లను వరుసగా గెలుచుకుంది. దీంతో మొదటి నాలుగు గేమ్‌లను సొంతం చేసుకుంది. ఈ జోరుతో తొలి సెట్‌ను 6-1తో ముగించింది. ఈ సెట్‌ కేవలం 23 నిమిషాల్లోనే పూర్తయింది.

63 నిమిషాల్లోనే..

రెండో సెట్‌లో ఒలినికోవా పోటీ పెంచినా.. ఈలా ఒత్తిడికి లోను కాలేదు. ఇద్దరూ సర్వీస్ బ్రేక్‌లు సాధించారు. 4-3 వద్ద ఈలా కీలక బ్రేక్ సాధించింది. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకుని 6-4తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 63 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో మేలో స్ట్రాస్‌బర్గ్‌లో తనను ఓడించిన ఒలినికోవాపై ఈలా ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్‌లో ఈలా 19 విన్నర్లు కొట్టగా.. ఒలినికోవా ఆరు విన్నర్లకే పరిమితమైంది.

ఇవా జోవిచ్‌తో..

ఈ విజయానికి న్యూయార్క్‌లోని ఫిలిప్పీన్స్ అభిమానుల మద్దతు కూడా తోడైంది. ఫిలిప్పీన్స్ జెండాలు, ‘లబాన్ అలెక్స్’ నినాదాలతో స్టేడియం సందడిగా మారింది. ఇక మూడో రౌండ్‌లో ఈలా అమెరికా ప్లేయర్ ఇవా జోవిచ్‌తో తలపడనుంది. జోవిచ్ రెండో రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన ఫ్రాన్సెస్కా జోన్స్‌ను 6-4, 6-4తో ఓడించింది. ఈ మ్యాచ్‌తో ఈలా యూఎస్ ఓపెన్‌లో మరింత ముందుకు వెళ్లే అవకాశం దక్కించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>