Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్‌లో స్వర్ణకారుల సంఘం ధర్నా.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి

కలం, నిర్మల్: స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు స్వర్ణకారుల సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్వర్ణకారుల పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు.

ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల రాకతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు నెలకు రూ.5 వేలు పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. జీఓ. నెం. 272ను సవరణ చేసి స్వర్ణకారులను దొంగ బంగారం కేసుల నుంచి కాపాడాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>