నిర్మల్‌లో రెండో రోజు హోరెత్తిన గణేష్‌ శోభాయాత్ర

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర (Nirmal Ganesh Immersion) శనివారం రెండో రోజు ఉత్సాహభరితంగా కొనసాగింది. బొజ్జ గణపయ్య విగ్రహాలను భాజాభజంత్రీల నడుమ పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి. డీజే పాటలు, భక్తి గీతాల మధ్య యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. ‘గణపతి బొప్పా మోరియా’ నినాదాలతో నిర్మల్ పట్టణం మారుమోగింది. గణేశుడి దర్శనం కోసం రహదారుల వెంట ప్రజలు బారులుతీరారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, బైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్వతీ తనయుడికి వీడ్కోలు పలికేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులు తరలిరావడంతో నిర్మల్‌లో రెండో రోజు నిమజ్జన శోభాయాత్ర సందడిగా సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>