Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ జిల్లాలో ఫిజీషియన్ డాక్టర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

కలం, నిర్మల్ : నిర్మల్(Nirmal) జిల్లా ఫిజీషియన్ డాక్టర్ల సంఘం (ఏపీఐ టీఎస్) నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నిక చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో  చైర్మన్‌గా డాక్టర్ ముఖేష్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింతపండు రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా డాక్టర్ మహేష్ బాబు ఎన్నికయ్యారు.

వైస్ చైర్మన్‌లుగా డాక్టర్ సుమల, డాక్టర్ రణీత్ ఎంపికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ శ్రీకర్, డాక్టర్ దయాకర్ ఎన్నిక కాగా, ఈసీ సభ్యులుగా డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అఖిలారెడ్డి, డాక్టర్ జవహర్, డాక్టర్ శృతి రెడ్డి, డాక్టర్ బి.రవి ఎంపికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను సీనియర్ వైద్యులు డాక్టర్ దామెర రాములు ఎన్నికల అధికారిగా పర్యవేక్షించారు. నూతన కార్యవర్గం వైద్య రంగ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.

Read Also: 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు పచ్చజెండా: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>