ఇబ్బందుల్లో ప్రజలు.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల చక్కర్లు : శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలబెట్టి అక్రమంగా సంపాదించిన డబ్బునంతటిని కక్కిస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ కూడలి లో జరిగిన బిఆర్ఎస్ భారీనిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గద్దెనెక్కిన వెంటనే ఇచ్చిన హామీలు మర్చిపోవడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందన్నారు.

తమ సొంత పార్టీ నేతలైన చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కొండా, కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాట్లాడిన మాటలు కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఢిల్లీలో సీఎం, మంత్రులు చక్కర్లు కొడుతున్నారనీ ఆయన విమర్శించారు. రైతులు, వృద్దులు, మహిళలు, ఉద్యోగులు, ఏ వర్గాన్నీ పట్టించుకోకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

వీరంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరం లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రజలకు క్షమాపణ చెప్పి 22ఏ రద్దు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి అరాచకాలు రాష్ట్రంలో బాగా పెరిగిపోయాయని, పేదల ప్రజలను వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 2లక్షల ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. నిరుద్యోగ ముదిరాజ్ లను బీసీ- ఏ లో చేర్చాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు, నేతన్నలకు, యాదవులు, రజకులు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు వెంటనే అమలు చేయాలన్నారు.

పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ లను ఎండ బెట్టి ఆంధ్రకు నికర జలాలు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెజర్వాయర్లు నింపుతామని, రైతులకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>