ఫార్మర్‌ రిజిస్ట్రీపై కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: ఫార్మర్‌ రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ సర్వే (Digital Crop Survey) ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మండలాల వారీగా పూర్తి చేయాల్సిన ఫార్మర్‌ రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ సర్వే, ఇప్పటి వరకు పూర్తయిన ప్రక్రియ, ఇంకా పూర్తి చేయాల్సిన ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే, ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు.

వాలంటీర్లందరూ డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. పంటల కోతల సమయానికి ముందే డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే రబీ పంట కాలంలో రైతులు పంట మార్పిడి విధానాలను విస్తృతంగా పాటించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుతో మాట్లాడి పంట మార్పిడి విధానాల ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, మండల వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>