పెండింగ్ భూ సమస్యలు స‌త్వ‌ర‌మే పరిష్కరించాలి: భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లతో పెండింగ్ భూసమస్యల దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

దరఖాస్తుదారుల వినతులను నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. తగిన ఆధారాలు లేని దరఖాస్తులను తిరస్కరించే సమయంలో అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. భూసమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, రెవెన్యూ, సర్వే బృందాలు సమన్వయంతో పని చేసి భూవివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>