మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉంటా.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, నిర్మల్: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉట్నూర్‌‌లోని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (Vedma Bhojju) పటేల్‌ నివాసంలో శుక్రవారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు శుక్రవారం రాఖీలు కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్షాబంధన్ సోదర ప్రేమ, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

మహిళల సంక్షేమం, భద్రత, అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>