విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌‌లో (Sofinagar) విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Nirmal Collector Bhavesh Mishra) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉపకేంద్ర నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి కేటాయించిన స్థలం విస్తీర్ణం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, ఇతర అంశాలపై అధికారులను కలెక్టర్ వివరాలు అడిగారు.

ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన మ్యాపులు, ప్రణాళికలను పరిశీలించిన కలెక్టర్ (Nirmal Collector) నిర్మాణ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఉపకేంద్ర నిర్మాణం పూర్తయితే స్థానికంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈస్థల పరిశీలనలో విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, డీఈ నాగరాజు, అర్బన్ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : భూ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎర్రబెల్లి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>