భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, బాసర : భూముల రీసర్వే (Land Resurvey) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. సోమవారం బాసర మండలం మాదాపూర్ గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత అధికారుల నుంచి గ్రామంలో చేపట్టిన రీసర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది తప్పనిసరి క్షేత్రస్థాయి సర్వే సమయంలో అందుబాటులో ఉండాలన్నారు. సర్వే నిర్వహణకు సంబంధించిన రైతులకు సమాచారం ముందుగానే అందించాలన్నారు. సంబంధిత కమతాల రైతులంతా సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడాలని వివరించారు. సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. ఈ పరిశీలనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపిడివో దేవేందర్ రెడ్డి, రెవెన్యూ, సర్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>