కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) మంగళవారం తనిఖీ చేశారు. గోదాంలోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు అగ్నిమాపక వ్యవస్థను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం గోదాం వద్ద భద్రతా చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.
పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ పటిష్ట భద్రతను కల్పించాలని ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా, వాటి పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, అర్బన్ తహసిల్దార్ రాజు, అధికారులు స్వాతి పాల్గొన్నారు.

