అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడుకుంటూ, స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటుబుక్స్‌ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌, కలెక్టర్ క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>