‘SIR’పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు

కలం, ముధోల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న బీజేపీ మహా పాదయాత్ర (BJP Maha Padayatra) కు ముధోల్ (Mudhol) నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది మహా పాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియ చేపడుతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. వరుస ఎన్నికల ఓటములతో భయపడిన రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధమైన సంస్థలపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే మహా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>