ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి CITU డిమాండ్

కలం, బోనకల్: ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లకు (ASHA Workers) ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని CITU మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండల ప్రాథమిక వైద్యాధికారి వీ.స్రవంతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పారితోషికంలో సగం పెన్షన్, నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, రెండో పీఆర్సీలో రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని కోరారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని, ప్రతి ఆదివారం, పండుగ సెలవులతో పాటు సంవత్సరానికి 20 రోజుల క్యాజువల్ సెలవులు, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 15న నిర్వహించనున్న ఆశా వర్కర్ల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమణ, సరోజిని, యూనియన్ నాయకులు కుక్కల కోటేశ్వరి, మరీదు లీలాకుమారి, గంగదేవుల లక్ష్మి, నంచర్ల దుర్గ, కొంగర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>