Mobile Popup Ad
Mobile Popup Ad

నీరవ్ మోదీకి భారీ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందే..!

కలం, వెబ్ డెస్క్ : భారత్ నుంచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ (Nirav Modi)కి లండన్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఆయన కంపెనీ రుణ రికవరీ వివాదంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 10.7 మిలియన్ డాలర్ల (రూ.100 కోట్లకు పైగా) కంటే ఎక్కువ చెల్లించాల్సిందేనని నీరవ్ మోదీని లండన్ హైకోర్టు ఆదేశించింది. కంపెనీ రుణ రికవరీ వివాదంలో తనకు సరైన నోటీసులు ఇవ్వలేదని నీరవ్ మోదీ చేసిన వాదనలను కోర్టు కొట్టిపారేసింది.

కాగా, దుబాయ్ లో ఉన్న తన ‘ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్‌ఈ’ కంపెనీకి రుణ సదుపాయానికి గానూ ఆగస్టు 3, 2013న నీరవ్ మోదీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.1 ( రూ.38.9) మిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. అయితే 2018 ప్రారంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో డబ్బులు చెల్లించాలని బ్యాంకు పంపిన డిమాండ్ నోటీసులను నీరవ్ మోదీ, అతడి కంపెనీ పట్టించుకోలేదు.

అయితే ప్రస్తుతం ఆ డబ్బులకు గానూ  అసలు 4.1 మిలియన్లతో పాటు వడ్డీ కలిపి మొత్తం 10.7 మిలియన్ డాలర్ల (రూ.100 కోట్లకు పైగా) కంటె ఎక్కువ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించాలని లండన్ హైకోర్టు నీరవ్ మోదీకి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉంటే దేశంలో దాదాపు రూ. 13,000 కోట్ల పీఎన్‌బీ రుణ మోసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. భారతీయ దర్యాప్తు సంస్థలు నీరవ్ మోదీని దేశానికి రప్పించడానికి, నిధులను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్న వేళ లండన్ హైకోర్టు తీర్పు భారతీయ బ్యాంకులకు ఊరటనిస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>