కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Dhar Accident) జరిగింది. సాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీశ్రా గ్రామం వద్ద మౌ-నీముచ్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో అదుపుతప్పిన కారు సమీపంలోని వంతెన పైనుంచి కిందకు దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా విస్తరించాయి.
ఈ ప్రమాదం(Dhar Accident)లో కారులో ఉన్నవారికి బయటకు వచ్చే సమయం దొరక్కపోవడంతో నలుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొక యువకుడిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సహాయం కోసం బాధితుడిని ఇండోర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి గాయాలు!
Follow Us On: Youtube

