కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా కుల్దీప్ యాదవ్‌పై తాను ఎందుకు కోపంగా స్పందించానో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వెల్లడించాడు. ఆ ఘటనపై అప్పట్లో వచ్చిన ఊహాగానాలకు ఇప్పుడు తెరదించాడు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో అతడు కొంత నిరాశగా ఉన్నాడని సూర్య చెప్పాడు. ఆ తర్వాత లాంగ్ ఆన్‌లో కుల్దీప్ సులభమైన క్యాచ్‌ను వదిలేశాడు. క్యాచ్ కోసం అతడు పెద్దగా ప్రయత్నించలేదని సూర్య తెలిపాడు.
అందుకే ఆ సమయంలో తనకు కోపం వచ్చిందని వివరించాడు. మ్యాచ్ తర్వాత ఇద్దరూ కోపంగా ఒకరినొకరు చూసుకున్నారు. అయితే అది పెద్ద గొడవ కాదని సూర్య స్పష్టం చేశాడు. తెరపై అలా కనిపించినా.. అది తమ మధ్య సరదా మాత్రమేనని చెప్పాడు. ఈ ఘటన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సూర్య వివరణతో ఆ ఊహాగానాలకు స్పష్టత వచ్చింది.

