‘సర్’ రెండో దశను ఓటర్లు వినియోగించుకోవాలి: జిల్లా కాంగ్రెస్ 

కలం, నారాయణపేట: రాజ్యాంగంలో ఓటే వజ్రాయుధం కాబట్టి సర్ (SIR) ప్రక్రియలో ఓటు గల్లంతు కాకుండా బీఎల్ఓ ద్వారా నోటీసులు అందిన వారు తప్పకుండా నోటీసు స్వీకరించి  సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి తప్పనిసరిగా బీఎల్ఏల ద్వారా బీఎల్ఓలకు అందించాలని జిల్లా కాంగ్రెస్ (Narayanpet Congress) అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఎస్ఐఆర్ అంశంపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి..

ఎస్ఐఆర్ ప్రక్రియ రెండవ దశ కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిందని తెలిపారు. నోటీసులు అందిన వారు తప్పనిసరిగా ఫోటో దిగి సంబంధిత వివరాలను పూర్తి చేసి తప్పనిసరిగా నిర్ణీత గడువులోపు బీఎల్ఏల ద్వారా బీఎల్ఓ లకు అందించాలన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో సుమారుగా 72, 861 ఓటర్లకు అలాగే మక్తల్ నియోజకవర్గంలో 73 వేల 815 ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియ అంశానికి సంబంధించి నోటీసులు వచ్చాయన్నారు. వీరంతా తప్పకుండా ప్రత్యేక ఫామ్స్ ద్వారా వివరాలను నమోదు చేసి నిర్ణీత గడువులోపు అందించాలన్నారు.

బీఎల్ఏలు సహకరించాలి..

నోటీసులు అందిన వారికి కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ ఏజెంట్లు సహకరించి ఓటు గల్లంతు కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన అర్హులు (అక్టోబర్ 1 వ తేదీ వరకు 18 ఏళ్ళు వయస్సు నిండిన వారు) కొత్త ఓటర్ గా నమోదు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని యువ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే  ఎన్నికల కమిషన్ నుంచి చనిపోయిన వారి జాబితా, ఇటీవల చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనని వారి జాబితా, ఎస్ఐఆర్ ఫామ్ లో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేసిందని.. దీని ప్రకారంగా పార్టీకి సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్లు ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ఆధారంగా చేసుకుని తమ బూత్ పరిధిలోని వారి ఓటు గల్లంతు కాకుండా చూడాలన్నారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఎన్యూమరేషన్ ఫామ్ పొందని వారు కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి నాలుగు వారాల గడువు కోరారని అందుకు గాను ఎన్నికల కమిషన్ సహకరించి గడువును పోడగించాలని డిమాండ్ చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మనోహర్ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, డీసీసీ సెక్రటరీ వెంకట్ రాములు చారి తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>