కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలి: NFIR ప్రధాన కార్యదర్శి

కలం, కాజీపేట: కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్‌గా (Kazipet Railway Division) ప్రకటించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ (NFIR) జనరల్ సెక్రటరీ డా. మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. లోకో రన్నింగ్ సిబ్బందిపై పని భారం తగ్గించేలా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. NFIR ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో నిర్వహించిన లొకో సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకో పైలెట్లు, రన్నింగ్ స్టాఫ్, గార్డులు, ఇతర రైల్వే కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా సుమారు 17.67 లక్షల మంది ఉద్యోగులు 276 కేటగిరీల్లో రైల్వే వ్యవస్థలో పనిచేస్తున్నారని రాఘవయ్య తెలిపారు. కుటుంబాలకు దూరంగా, అధిక పనిభారంతో విధులు నిర్వహిస్తున్న రన్నింగ్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రన్నింగ్ స్టాఫ్ కోసం డిపో ఏర్పాటు చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో NFIR అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్, జోనల్ సెక్రటరీ కె.వి.ఆర్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కరువు.. కరెంట్ కష్టాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>