అయ్యో పాపం.. ముళ్ల పొదల్లో పసికందు

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ (Nyalakal) మండల కేంద్రంలో అమానుషం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు న్యాల్‌కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. పసికందు ఏడుపును గుర్తించిన స్థానికులు ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు శిశువును చికిత్స నిమిత్తం సంగారెడ్డి లోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>